News July 5, 2025
రామన్నపేట: ‘పెండింగ్‌లో 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు’

పెండింగ్ పెన్షన్లను విడుదల చేయాలని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని ఆమోదించాలన్నారు. కార్పొరేషన్ బలోపేతం, జిల్లాల్లో TCPC కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామన్నపేట MROకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో సుమారు 43.02 లక్షల మంది దివ్యాంగులు జీవిస్తున్నారని, 24.85 లక్షల చేయూత పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
Similar News
News July 6, 2025
వ్యాసాశ్రమంలో దశాబ్దాల తర్వాత కలిశారు..!

ఏర్పేడు(M) వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. 1965 నుంచి 2000వ సంవత్సరం వరకు చదవిన దాదాపు 150 మంది రావడంతో అందరిలోనూ సంతోషం నెలకొంది. ఇక్కడ చదివిన తామంతా ఉన్నతస్థాయికి చేరామని, ఇదంతా మలయాళస్వామి కృపేనని పేర్కొన్నారు. ఏర్పేడులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరూ వ్యాసాశ్రమంలో చదివారా? బ్యాచ్ పేరుతో కామెంట్ చేయండి.
News July 6, 2025
రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన

వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహించారు. షో నిలిపి వేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.
News July 6, 2025
పెద్దమందడిలో 12.8 మి.మీ వర్షపాతం

జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) పెద్దమందడిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. అమరచింత 10.2 మదనాపూర్ 6.2 ఘనపూర్ 1.4 గోపాల్పేట్ 1.6 రేవల్లి 7.6 పానగల్ 4.4 వనపర్తి 1.2 కొత్తకోట 2.6 ఆత్మకూరు 1.6 శ్రీరంగాపూర్ 3.0 వీపనగండ్ల 2.8 చిన్నంబావి లలో 1.8 మి.మీ వర్షపాతం, పెబ్బేర్‌లో ‘0’మి.మీ వర్షపాతం నమోదయినట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు.