News July 5, 2025
ఈ ఏడాది మెగా PTM స్పెషాలిటీ ఏమిటంటే.?

NTR జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో కూడా ఈనెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ (PTM) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులతో పాటు పూర్వ విద్యార్ధులు కూడా ఈ సమావేశాలకు హాజరై తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహిస్తామన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పలు పోటీలు జరుగుతాయన్నారు.
Similar News
News July 6, 2025
VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
News July 6, 2025
అమ్రాబాద్: దివ్య శైవ క్షేత్రం లొద్ది మల్లయ్య ఆలయం

దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో, గుహలు, జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది మూడున్నర వందల కోట్ల సంవత్సరాల పురాతన గుహ. ఇది హైదరాబాద్ -శ్రీశైలం వెళ్లే దారిలో 65 కి.మీ రాయి దగ్గర కుడి వైపు నుంచి లోయలోకి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే ఈ గుహ వస్తుంది.
News July 6, 2025
కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.