News July 5, 2025
అన్నమయ్య: అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి (M) రాయవరం గ్రామంలో కావలిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ఆండీ గోవిందన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శనివారం రాయచోటి రూరల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ఎదుట నిందితుడుని అదనపు ఎస్పీ వెంకటాద్రి తీసుకొచ్చారు. అతని నుంచి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.
News July 6, 2025
బ్లాక్ మార్కెట్ దందాపై విచారించాలి: KTR

TG: కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఎరువులకూ కరువొచ్చింది. రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉండటమేంటి? యూరియా బస్తా ధర ₹266.50 నుంచి ₹325కు ఎందుకు పెరిగింది? ఈ బ్లాక్ మార్కెట్‌ను నడిపిస్తుంది ఎవరు? ప్రభుత్వం విచారించాలి’ అని డిమాండ్ చేశారు.
News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.