News July 5, 2025
పెందుర్తిలో వ్యభిచార గృహంపై దాడి

పెందుర్తిలో వ్యభిచార గృహంపై పోలీసులు శనివారం దాడులు చేశారు. భార్యాభర్తలమంటూ బీసెట్టి ధనలక్ష్మి, వివేక్ సుజాతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం రావడంతో సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. వారిద్దరితో పాటు ఓ విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డుతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవాలని సీఐ సూచించారు.
Similar News
News July 6, 2025
సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.