News July 5, 2025

NZB: ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.

Similar News

News September 11, 2025

NZB: అడ్మిషన్లకు రెండు రోజులు మాత్రమే

image

2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ , ప్రైవేటు, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల్లో ఇంటర్ అడ్మిషన్ల లాగిన్ ఓపెన్ చేసేలా ఈ నెల 11, 12 తేదీల్లో ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని నిజామాబాద్ DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశానుసారం ప్రైవేటు కళాశాల్లో నామినల్ రోల్ కరెక్షన్ కోసం రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఎలాంటి రుసుం ఉండదన్నారు.

News September 11, 2025

NZB: వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి

image

నిజామాబాద్ సుభాష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం ఉదయం ఖిల్లా ప్రాంతానికి చెందిన మహేష్(32) వాహనంలో వెనుక కూర్చొని వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల మహేష్ కింద పడి గాయలపాలయ్యాడు. అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News September 11, 2025

నిజామాబాద్‌లో ఉద్యోగ మేళా

image

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూధన్‌రావు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలతో ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305743423, 9948748428 నంబర్లను సంప్రదించాలని సూచించారు.