News July 5, 2025

పీ-4 కార్యక్రమం నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

image

పీ-4, స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమాల అమలులో భాగంగా, ఆగస్టు 15వ తేదీలోగా బంగారు కుటుంబాల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ‘మీ-కోసం’ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే 67 వేల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News September 7, 2025

కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ

image

జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా సరఫరా చేయాలని సూచించారు.

News September 7, 2025

మచిలీపట్నం: పర్యాటకుల జేబుకు చిల్లు..!

image

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతున్నారు. ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌పై కూడా ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 7, 2025

మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.