News March 30, 2024
దత్తిరాజేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

దత్తిరాజేరు మండలం మరడాం నుంచి కోమటిపల్లి వెళ్లే రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని శనివారం ఉదయం వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చుక్క పేట గ్రామానికి చెందిన ఈశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మానాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 31, 2026
జూన్‌లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

విజయనగరం జిల్లాలో మంజూరైన గృహ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై మంగళవారం హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో లేఅవుట్లలో 16,316 ఇళ్లు, సొంత స్థలాల్లో 3,161 ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
News March 31, 2026
VZM: ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి

జిల్లాలో నిర్మాణంలో గల ఆసుపత్రుల నూతన భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో నిర్మాణంలో గల భోగాపురం, ఎస్.కోట, నెల్లిమర్ల, బాడంగి, చీపురుపల్లి, గజపతినగరం, రాజాం, బొబ్బిలి ఆసుపత్రుల నూతన భవనాల పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
News March 31, 2026
భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తోటపల్లి బ్యారేజ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేసి, ప్రభుత్వ భూములను త్వరగా అప్పగించాలని, అవార్డులు పెండింగ్‌లో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు.


