News July 6, 2025

ఎన్టీఆర్: ఎంటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్(CSE)- 2024 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షలను ఆగస్టు 6 నుంచి నిర్వహిస్తామని KRU అధ్యాపక వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా, 23లోపు రూ.200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని, వివరాలకు https://kru.ac.in/ చూడాలని KRU అధ్యాపకులు సూచించారు.

Similar News

News July 6, 2025

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఖాజాపూర్ వాసి ఎంపిక

image

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కి చెందిన విష్ణు శ్రీ చరణ్ ఎంపికైనట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు. జులై 12, 14వ తేదీల్లో దెహ్రదూన్‌లో జరిగే జాతీయ రగ్బీ పోటీలలో చరణ్ పాల్గొనున్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన చరణ్‌ను గ్రామస్థులు అభినందించారు.

News July 6, 2025

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

image

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.

News July 6, 2025

WGL: అందరి చూపు గాంధీ భవన్ వైపే..!

image

HYD గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సోమవారం కీలక సమావేశం కానుంది. WGL కాంగ్రెస్‌ MLAలు, మంత్రి సురేఖ మధ్య విభేదాలతో వచ్చిన ఫిర్యాదులపై కమిటీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండా మురళి వ్యాఖ్యలపై MLAలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లగా.. మురళి, సురేఖ సైతం ఆమెను కలిసి తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా రేపటి సమావేశం వరంగల్‌లో ఉత్కంఠ రేపుతోంది.