News March 30, 2024
కామారెడ్డి జిల్లాలో భానుడి భగభగలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. మార్చి మెుదటి వారం నుంచి భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి ముగియకముందే కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరువైంది. దీంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. బిచ్కుంద మండలంలో 41.9, దోమకొండ 40.5, రామారెడ్డి 40.4, పుల్కల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News September 9, 2025
ఆర్మూర్: చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెర్కిట్‌కు చెందిన ఓ మహిళ(50) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది చెరువులోకి దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు.
News September 8, 2025
NZB: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా సీనియర్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. బస్వా లక్ష్మీనర్సయ్య గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, మెదక్ జిల్లా ప్రభారిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
News September 8, 2025
నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.