News July 6, 2025

నిజామాబాద్: కళాశాలల మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.3.23 కోట్లు

image

నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, విద్యుత్తు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం రూ.3.23 కోట్లు మంజూరు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

image

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.

News July 6, 2025

నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

image

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.

News July 6, 2025

NZB: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.