News July 6, 2025
HYD: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? జాగ్రత్త.!

సెకండ్ హ్యాండ్‌లో సెల్ ఫోన్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు. కొందరు దొంగిలించిన మొబైళ్లను దుకాణాల్లో అమ్ముతున్నారని తెలిసిందన్నారు. ఇటీవల వనస్థలిపురంలో సెకండ్ హ్యాండ్‌లో ఫోన్ కొని సిమ్ కార్డు వేసిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్ తనకు అమ్మారని తెలుసుకున్న బాధితుడు తల పట్టుకున్నాడు. ఇటువంటి విషయంతో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News July 6, 2025
ప్రైవేట్ పాఠశాలల్లోనూ నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జులై 10న పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్-పీటీఎం 2.0 సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. గతంలో కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైన సమావేశాలు ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీసే విధంగా పలు పోటీలు జరుగుతాయన్నారు.
News July 6, 2025
ఖైరతాబాద్: లైసెన్స్ రెన్యూవల్‌కు దూరం.. దూరం !

గ్రేటర్‌లో ఏ వ్యాపారం నిర్వహించాలన్నా GHMC ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోగా రెన్యూవల్ చేయించాలి. అయితే ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 10వేల వ్యాపార సంస్థలు ఉంటే 4వేల మంది, జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 15వేల మంది వ్యాపారులు ఉంటే 7వేల మంది మాత్రమే తమ ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ఏడు నెలలు దాటుతున్నా లైసెన్సు రెన్యూవల్ గురించి వ్యాపారులు ఆలోచించడం లేదు.
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.