News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.
Similar News
News September 8, 2025
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్‌కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.
News September 7, 2025
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

జిల్లాలో యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఆదివారం రాప్తాడు మండలం అయ్యవారిపల్లి రోడ్‌లో ఉన్న మార్క్‌ఫెడ్ స్టాక్ స్టోర్ గోడౌన్‌ను తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న యూరియాపై అధికారులతో ఆరా తీశారు. యూరియా పంపిణీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
News September 7, 2025
పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

సీఎం పర్యటన నేపథ్యంలో పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అనంతపురంలోని బెంగుళూరు జాతీయ రహదారి పక్కన ప్రసన్నాయపల్లి గేటు వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ స్థలంలో పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎస్పీ వెంకటేసులు పాల్గొన్నారు.