News July 6, 2025

వికారాబాద్ జిల్లాలో కొత్తగా 8993 మంది

image

వికారాబాద్ జిల్లాలో గత నెలలో నిర్వహించిన బడిబాట సత్ఫలితాలు ఇవ్వడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1925 ఎక్కువగా అడ్మిషన్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి 8993 అడ్మిషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. గత సంవత్సరంలో 7,078 అడ్మిషన్లు వచ్చాయి. అయితే గవర్నమెంట్ టీచర్లు చేపట్టిన బడిబాటతో మంచి స్పందన వచ్చింది. సర్కారు కల్పించే సౌకర్యాలూ వివరిస్తూ వచ్చారు.

Similar News

News July 6, 2025

అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.

News July 6, 2025

మంచిర్యాల: గోదావరిలో గుర్తు తెలియని మహిళ శవం

image

గుర్తు తెలియని మహిళ శవం గోదావరిలో లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మంచిర్యాల శివారులోని గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు జారిపడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.