News July 6, 2025
7న ప్రజావాణి రద్దు: హనుమకొండ కలెక్టర్

హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 6, 2025
F-35B గురించి తెలుసా?

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
News July 6, 2025
మంచిర్యాల: గోదావరిలో గుర్తు తెలియని మహిళ శవం

గుర్తు తెలియని మహిళ శవం గోదావరిలో లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మంచిర్యాల శివారులోని గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు జారిపడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
విశాఖలో రేపు P.G.R.S.

విశాఖలో కలెక్టరేట్, జీవీఎంసీ, సీపీ ఆఫీసుల్లో సోమవారం P.G.R.S. నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉదయం 9.30కు P.G.R.S. ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. జీవీఎంసీ ఆఫీసులో మేయర్, కమిషనర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు స్వీకరించనున్నారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులో సీపీ ప్రజల నుంచి వినతులు అందుకోనున్నారు. కాల్ సెంటర్ 1100ను సంప్రదించి కూడా ప్రజలు వినతులను నమోదు చేసుకోవచ్చు.