News July 6, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరట

image

విజయవాడ మీదుగా షాలిమార్(SHM)-చెన్నై సెంట్రల్(MAS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02841 SHM-MAS రైలును జులై 14, 21, 28 తేదీలలో, నం.02842 MAS-SHM మధ్య నడిచే రైలును జులై 16, 23, 30 తేదీలలో నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్‌లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News July 6, 2025

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: ములుగు కలెక్టర్

image

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

News July 6, 2025

అనకాపల్లి: ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయ్యోచ్చు’

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం పేర్కొన్నారు. సమస్యలపై meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించామన్నారు. వారి సమస్యల పరిష్కార స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.