News July 6, 2025
తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
Similar News
News July 8, 2025
పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.
News July 7, 2025
రేపు శ్రీశైలంలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

AP: CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. రేపు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 11గం.లకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12గం.కు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మ.2.30కి అమరావతికి వెళ్తారు.
News July 7, 2025
‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా?’ అని దేవుడికి లేఖ రాసి..

TG: వేములవాడకు చెందిన దీటి రోహిత్(23) ఆత్మహత్యకు ముందు దేవుడి(శివుడు)కి రాసిన లేఖ కదిలిస్తోంది. ‘నీకు మతి ఉండే నా తలరాత రాశావా? నీ కొడుకు తలరాత అలా రాయలేదే! మేం కొడుకులం కాదా?’ అని ప్రశ్నించాడు. ‘బెస్ట్ సూసైడ్ లెటర్ రాయాలన్న నా కోరిక ఇప్పుడు నెరవేరింది. మరో జన్మ వద్దు’ అంటూ రాసుకొచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల డాక్టర్ అవ్వాలన్న తన కోరిక తీరకపోవడంతోనే రోహిత్ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది.