News July 6, 2025

ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

image

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

Similar News

News July 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 7, 2025

GILL: ప్రపంచంలో ఒకే ఒక్కడు

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచులో 400+, లిస్ట్ ఏ మ్యాచులో 200+, టీ20 మ్యాచులో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచంలో మరే ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా రెండో టెస్టు మ్యాచులో గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

News July 7, 2025

పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది: మోదీ

image

17వ BRICS సదస్సులో ‘శాంతి-భద్రత, రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్’ అనే అంశంపై జరిగిన చర్చలో.. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఒక్కటిగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది. ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రవాదుల్ని ఏ దేశం ప్రోత్సహించినా మూల్యం చెల్లించేలా చేయాలి. బాధితుల్ని, ఉగ్రవాదుల్ని ఒకే త్రాసులో ఉంచలేం’ అని మోదీ పేర్కొన్నారు.