News July 6, 2025

డ్రోన్ యంత్రాలతో ప్రత్యేక గస్తీ: ఎస్పీ

image

మహిళల భద్రతకు శక్తి దళం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రోన్ యంత్రాల ద్వారా ఆకతాయిల కదలికలను పసిగడుతున్నామన్నారు. మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో నంబర్ :112, 1930, 1098 అలాగే శక్తి టోల్ ఫ్రీ నెంబర్: 7993485111 ఫోన్ చేయాలని సూచించారు.

Similar News

News July 8, 2025

ట్రాక్టర్‌లు, కారు ఢీ.. పది మందికి గాయాలు

image

గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతావారిగూడెం వద్ద రెండు ట్రాక్టర్లు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2025

పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

image

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.

News July 8, 2025

మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.