News July 6, 2025
అనంత: ‘బెంగళూరు వెళ్తున్నానని చెప్పి లవర్‌ను పెళ్లి చేసుకుంది’

ప్రత్యేక కోర్సు కోసం బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనంతపురం శ్రీనివాసనగర్‌కు చెందిన యువతి, ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు షాకిచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ఆమె జూన్ 20న ఇంటి నుంచి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. త్రీ టౌన్ PSలో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఆమె ఆచూకీ లభించగా, ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది.
Similar News
News July 8, 2025
ట్రాక్టర్‌లు, కారు ఢీ.. పది మందికి గాయాలు

గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతావారిగూడెం వద్ద రెండు ట్రాక్టర్లు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.
News July 8, 2025
మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.