News July 6, 2025

మహానందిలో క్షుద్ర పూజల కలకలం

image

మహానంది పుణ్యక్షేత్రం ఆవరణలోని గరుడ నంది పక్కన తాటి చెట్ల దగ్గర రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో స్త్రీ బట్టలు, క్షుద్ర పూజా సామగ్రి ఉండటం చూసిన గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News July 7, 2025

విశాఖ: వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

image

వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిపై మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేయగా బెయిల్ మంజూరు అయింది. గత నెల 23వ తేదీన నిర్వహించిన వైసీపీ యువత పోరు కార్యక్రమంలో ఆమె పాల్గొనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వడంతో ఇవాళ మహారాణిపేట సీఐ భాస్కరరావు ఎదుట ఆమె విచారణకు హాజరయ్యారు. కోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలను సీఐకు సమర్పించారు.

News July 7, 2025

రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్‌తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

News July 7, 2025

సిద్దిపేట: ‘మెరుగైన సేవలు అందిస్తున్నాం’

image

రవాణా శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రవాణా శాఖ అధికారి వెంకటరమణ అన్నారు. సోమవారం సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ మేరకు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి రావాలన్నారు.