News July 6, 2025

ఏలూరు జిల్లాలో సోమవారం PGRS:కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాలలో PGRS జరుగుతుందన్నారు. ఆయా కారణాలతో ఆయా వేదికలకు రాలేని ప్రజలు https://meekosam. ap. gov. in తమ అర్జీలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. ఉదయం10 నుంచి కార్యక్రమం జరుగుతుందన్నారు.

Similar News

News July 8, 2025

అమ్మ పేరుతో ఓ మొక్క నాటించాలి: కలెక్టర్

image

ఏక్ పేడ్.. మాకే నామ్ (అమ్మ పేరుతో ఓ మొక్క) విద్యార్థులు నాటేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సోమవారం ఆదేశించారు. పాఠశాలల ప్రాంగణాలు, ఇళ్ల వద్ద నాటే మొక్కల బాధ్యత విద్యార్థులదేనన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని అన్నారు. మంగళవారం మొక్కలు నర్సరీల నుంచి ఆయా మండలాలకు చేరతాయన్నారు. వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు.

News July 8, 2025

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలి: మెదక్ కలెక్టర్

image

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కొల్చారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

News July 8, 2025

మెదక్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

image

మెదక్ ఆర్టీసీ డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.