News July 6, 2025

‘అల్లూరి జిల్లాకు రూ.10కోట్ల నిధులు’

image

అల్లూరి జిల్లా ఆకాంక్ష జిల్లా కావడం వలన నీతి ఆయోగ్ రూ.10కోట్ల నిధులు విడుదల చేసిందని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం తెలిపారు. ఆయా నిధులను విద్యాభివృద్ధికి వ్యయం చేస్తామన్నారు. జిల్లాలో 5 మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్ క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఫిజికల్ డైరెక్టర్లను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందిస్తామన్నారు.

Similar News

News July 8, 2025

ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.

News July 8, 2025

ట్రాక్టర్‌లు, కారు ఢీ.. పది మందికి గాయాలు

image

గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతావారిగూడెం వద్ద రెండు ట్రాక్టర్లు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2025

పదవి పోయిన గంటల్లోనే మాజీ మంత్రి మృతి

image

రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్తారోవోయిత్(53) అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోమన్‌ను అధ్యక్షుడు పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే తన కారులో శవమై కనిపించారు. గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కాగా ఇటీవల ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో వందలాది విమానాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ కారణంతోనే రోమన్‌పై వేటు వేసినట్లు తెలుస్తోంది.