News July 6, 2025
పార్వతీపురం: జిల్లాకు వచ్చిన నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్

అశావాహ జిల్లాగా గుర్తించిన పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ శనివారం వచ్చారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి సత్కరించారు. జిల్లాలో అశావాహ జిల్లాగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు.
Similar News
News July 6, 2025
ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి: అమర్నాధ్

వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్ అన్నారు. రోలుగుంటలో ఆదివారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త ప్రజలకు వివరించాలని అమర్నాధ్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికునిలా ఇప్పటి నుంచే పని చేయాలని పిలుపునిచ్చారు.
News July 6, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యమైన వార్తలు

☞ శ్రీశైలం డ్యామ్ గేట్ లీకేజ్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు: కన్నయ్య నాయుడు
☞ నంద్యాల: పొగాకును కొనుగోలు చేయాలని మంత్రి ఫారుక్‌కు వినతి
☞ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి బీసీ
☞ రుద్రవరం: వీధి కుక్కల దాడిలో కృష్ణజింక మృతి
☞ వెలుగోడు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం
☞డోన్ : రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
News July 6, 2025
విజయవాడ: శక్తిసేవకుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు

ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీని సమన్వయ పరిచేందుకు 100 మంది శక్తి సేవకులను వినియోగించుకున్నామని EO శీనానాయాక్ తెలిపారు. కనకదుర్గానగర్ నుంచి మహా మండపం 7వ అంతస్తు వరకు వీరు భక్తుల క్యూలైన్‌లను సమన్వయ పరిచారన్నారు. శక్తి సేవకులలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆలయ అధికారులు సుమారు 13 గంటల నిరంతర పర్యవేక్షణ జరపడంతో భక్తుల రద్దీ తగ్గిందని EO చెప్పారు.