News July 6, 2025
అమ్రాబాద్: దివ్య శైవ క్షేత్రం లొద్ది మల్లయ్య ఆలయం

దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో, గుహలు, జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది మూడున్నర వందల కోట్ల సంవత్సరాల పురాతన గుహ. ఇది హైదరాబాద్ -శ్రీశైలం వెళ్లే దారిలో 65 కి.మీ రాయి దగ్గర కుడి వైపు నుంచి లోయలోకి 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళితే ఈ గుహ వస్తుంది.
Similar News
News July 7, 2025
సూర్య ఘర్ పథకం లక్ష్యాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సోమవారం అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల ముందంజలో ఉన్న జె.పంగులూరు, నగరం మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ అభినందించారు. సంతమాగులూరు, మార్టూరు, కొరిశపాడు, కొల్లూరు, బాపట్ల, వేమూరు మండలాల ఎంపీడీవోలను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
News July 7, 2025
BHPL: ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోలీసు అధికారులు కృషి చేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ వివిధ రకాల సమస్యలతో వచ్చిన 18 మంది బాధితుల సమస్యలను సోమవారం అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
News July 7, 2025
కొత్తగూడెం: ‘మీకు దండం పెడతాం.. మాకు స్కూల్ కావాలి’

బూర్గంపహాడ్ మండలం శ్రీరాంపురం విద్యార్థులు తమ గ్రామంలో పాఠశాల లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 15 మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని, చదువుకునేందుకు స్కూల్‌కి వెళ్లడానికి నరకయాతన పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.