News July 6, 2025
VJA: ‘ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి’

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఛార్టర్డ్ అకౌంటెంట్-CA, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా JC ఎస్.ఇలక్కియా సూచించారు. ఈ నెల 12లోపు అభ్యర్థులు తమ కొటేషన్‌లను విజయవాడలోని కలెక్టర్, JC కార్యాలయంలో అందజేయాలన్నారు. మూడేళ్ల అనుభవం ఉండి అకౌంటింగ్ సిస్టమ్స్, టూల్స్ ప్రొఫిషయన్సీ, ఫైలింగ్ తదితర అంశాలలో పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
News July 7, 2025
జీవితంలో సవాళ్లను స్వీకరించాలి: మంత్రి లోకేశ్

AP: 2019 ఎన్నికల్లో ఓటమి బాధ తనలో కసి పెంచిందని, ఫలితమే 2024 ఎన్నికల్లో మెజార్టీ అని మంత్రి లోకేశ్ చెప్పారు. జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో విద్యాశాఖను తీసుకున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరులో రూ.15 కోట్లతో అధునీకరించిన ప్రభుత్వ స్కూల్‌ను ఆయన సందర్శించారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని మంత్రి చెప్పారు. అంతకుముందు స్కూళ్లోని తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
News July 7, 2025
సత్తెనపల్లి: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

సత్తెనపల్లి (M) గుడిపూడి రైల్వే ట్రాక్‌పై యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు గుడిపూడికి చెందిన సన్నీ (22)గా గుర్తించారు. మృతుడి తల్లి అనారోగ్యానికి గురవ్వగా పరామర్శించడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.