News July 6, 2025
శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీకి చెందిన పడాల. నారాయణ రావు(84) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుదీర్ పర్యవేక్షణలో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ సుజాత, చిన్ని కృష్ణ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.
Similar News
News July 7, 2025
శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.
News July 7, 2025
శ్రీకాకుళం: సేంద్రీయ ఎరువులతో అధిక దిగుబడి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో డీపీఆర్సీ వారు ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌లను DPO భారతి సౌజన్య సోమవారం పరిశీలించారు. సంపద కేంద్రాల్లో చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ చేసి అమ్మకాలు జరపాలని తెలిపారు. సేంద్రియ ఎరువులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వలన అధిక పంట దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్సీ రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
News July 7, 2025
నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.