News July 6, 2025

అనంతగిరిగా మార్చాలని డిమాండ్.. మీ కామెంట్ ?

image

వికారాబాద్ జిల్లాలో మరో కొత్త డిమాండ్ వినిపిస్తోంది. చుట్టూ అడవి, గుట్ట మీద అనంత పద్మనాభస్వామి కొలుదీరిన ప్రాంతానికి అనంతగిరి జిల్లాగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అనంతగిరి గుట్టల ప్రకృతి సోయగాలు, మూసీ నది జన్మస్థలం, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందటంతో జిల్లా పేరు మార్చాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News July 7, 2025

గద్వాల్: నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

జిల్లా నిరుద్యోగ యువత డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీట్‌) ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్‌చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరణ చేశారు. అర్హులు 92814 23575, 23576,23577 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News July 7, 2025

GWL: SP ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ అంశాలకు సంబంధించిన సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ విభేదాలకు సంబంధించిన అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు.

News July 7, 2025

VZM: కలెక్టరేట్‌కు 194 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.