News July 6, 2025

JGTL: పది నెలల ఉచిత శిక్షణ.. 2 రోజులే గడువు

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో UPSC ప్రిలిమ్స్ పరీక్ష కోసం 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను ఇస్తున్నట్లు జగిత్యాల SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లో శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9959264770 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News July 7, 2025

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను https://navodaya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ప్రవేశాలకు డిసంబర్ 13న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News July 7, 2025

GET READY: 7.03PMకి ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రోమో

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘కింగ్డమ్’ సినిమా విడుదల తేదీ ప్రకటనపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర విడుదల తేదీతో కూడిన ప్రోమో వీడియోను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News July 7, 2025

రాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. తలమీద నుంచి వెళ్లిన లారీ

image

నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్‌ మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఆయన తలపై ఎక్కింది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు నారపల్లికి చెందిన బాసిత్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.