News July 6, 2025

విజయవాడ: రాత పరీక్ష లేకుండా 170 ఉద్యోగాల భర్తీ

image

విజయవాడలోని AP స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు https://www.sthreenidhi.ap.gov.in/లో ఈ నెల 7 నుంచి 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ MD హరిప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,520 వేతనం ఇస్తామని, పూర్తి వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

Similar News

News July 7, 2025

సిద్దిపేట: ‘ప్రతిభ చూపే వారిని గుర్తిస్తాం’

image

ప్రతిభ చూపే అధికారులు, సిబ్బందిని గుర్తించి, వారిని ప్రోత్సహించేలా రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ తెలిపారు. అతి ఉత్కృష్ట సేవా పతక్‌కు ఎంపికైన త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ సోమవారం సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీపీ ఆయనను అభినందించారు. అతి ఉత్కృష్ట సేవా పతక్‌ను త్వరలో అందజేస్తామని తెలిపారు.

News July 7, 2025

పేరెంట్స్-టీచర్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఈనెల 10న పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యాసంస్థల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపే ప్రక్రియను సోమవారం మధ్యాహ్నానికే పూర్తి చేయాలని సూచించారు.

News July 7, 2025

ప్రభుత్వాన్ని నిలదీయాలి: గుడివాడ అమర్నాథ్

image

వైసీపీ శ్రేణులు సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కూటమి నాయకులు లేనిపోని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. హామీలు అమలుకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.