News July 6, 2025
గూగూడులో శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీల వెండి గొడుగు

నార్పల మండలంలోని గూగూడులో వెలిసిన శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీలు వెండి గొడుగు దేవస్థానం అధికారులు చేయించారు. ఈ సందర్భంగా వెండి గొడుగును దేవస్థానం అగ్నిగుండం చుట్టూ ఊరేగించారు. వెండి గొడుగులు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి కనబరిచారు. దేవస్థానానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున వెండిని భక్తులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Similar News
News July 7, 2025
అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

విజయవాడ: అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్‌ల నిర్మాణానికి ఇటీవల జరిగిన CRDA 50వ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో ఒక్కోటి 2.5 ఎకరాలలో 4 ప్రాంతాలలో ఈ సెంటర్‌లు ఏర్పాటు కానున్నాయి. అమరావతిలో నిర్మించనున్న 5 నక్షత్రాల హోటళ్ల సమీపంలో QBS విధానంలో ఈ కన్వెన్షన్ సెంటర్‌లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
News July 7, 2025
భద్రాద్రి: పంట పొలాలకు వెళ్లాలంటే సాహసమే.!

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రధాన రహదారుల పరిస్థితే ఇలా ఉంటే పంట పొలాలకు వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో ఊహకే అందనట్లు కనిపిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు గుంతల దారిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారుల్లో ఎరువుల బస్తాలు ఎలా తీసుకెళ్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరం అయినా పోయాలని కోరుతున్నారు.
News July 7, 2025
నిజామాబాద్: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.