News July 6, 2025

కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి: హరీశ్ రావు

image

TG: పదేళ్ల KCR పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో పలు కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

Similar News

News July 7, 2025

పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది: మోదీ

image

17వ BRICS సదస్సులో ‘శాంతి-భద్రత, రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్’ అనే అంశంపై జరిగిన చర్చలో.. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఒక్కటిగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది. ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రవాదుల్ని ఏ దేశం ప్రోత్సహించినా మూల్యం చెల్లించేలా చేయాలి. బాధితుల్ని, ఉగ్రవాదుల్ని ఒకే త్రాసులో ఉంచలేం’ అని మోదీ పేర్కొన్నారు.

News July 7, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 7, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.