News July 6, 2025
ఈ నెలలో 2.4లక్షల కొత్త రేషన్ కార్డులు: మంత్రి

TG: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామన్నారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ట్వీట్ చేశారు. ఈనెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే సభలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
Similar News
News July 8, 2025
జులై 8: చరిత్రలో ఈరోజు

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం
News July 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 8, 2025
లైంగిక ఆరోపణలు.. దయాల్‌పై FIR నమోదు

పేసర్ యష్ దయాల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాపురం PSలో FIR నమోదైంది. అతనిపై ఘజియాబాద్ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె CM గ్రీవెన్స్ పోర్టల్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.