News July 6, 2025
తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.
Similar News
News July 6, 2025
విజయవాడ: శక్తిసేవకుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు

ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీని సమన్వయ పరిచేందుకు 100 మంది శక్తి సేవకులను వినియోగించుకున్నామని EO శీనానాయాక్ తెలిపారు. కనకదుర్గానగర్ నుంచి మహా మండపం 7వ అంతస్తు వరకు వీరు భక్తుల క్యూలైన్‌లను సమన్వయ పరిచారన్నారు. శక్తి సేవకులలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఆలయ అధికారులు సుమారు 13 గంటల నిరంతర పర్యవేక్షణ జరపడంతో భక్తుల రద్దీ తగ్గిందని EO చెప్పారు.
News July 6, 2025
‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్‌గా రామ్ పాత్రకు సుమంత్‌ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్‌గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.
News July 6, 2025
విజయవాడ: దుర్గమ్మను దర్శించుకున్న 60 వేల మంది భక్తులు

విజయవాడ దుర్గమ్మను ఆదివారం 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు 500 బృందాలు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించాయన్నారు. నేడు తొలి ఏకాదశి, ఆదివారం కావడంతో ఆషాఢ సారె సమర్పణకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు 1,000 మంది వాలంటీర్‌ల సేవలు వినియోగించుకున్నామని అన్నారు.