News July 6, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కేజీ రూ.170 ధర పలుకుతోంది. స్కిన్‌లెస్ కేజీ రూ.200-210 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150 మధ్య ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొంత కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News July 6, 2025
జిందాల్ భూముల వ్యవహారంపై స్పందించిన మంత్రి

జిందాల్ భూముల వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ‘ఎక్స్’ వేదికగా ఆదివారం స్పందించారు. జిందాల్ భూముల్లో MSME పార్కుల అభివృద్ధి ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, ఆ పార్కుల్లో ఏ పరిశ్రమలు వస్తాయనేది ఇంకా స్పష్టత లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేస్తేనే నీరు సరఫరాపై ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులకు ఇంకా ఏమైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందన్నారు.
News July 6, 2025
చీరాల: కుక్కను ఢీకొని ఆగిన వందే భారత్

విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఆదివారం సాయంత్రం కుక్కను ఢీకొనడంతో 20 నిమిషాలు ఆగిపోయింది. ఈ ఘటన కారంచేడు రైల్వే గేట్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు సమాచారం ప్రకారం.. కుక్క కళేబరం బ్రేక్ సిస్టంకి అడ్డుపడింది. ఈ కారణంగా సాంకేతిక లోపం ఏర్పడగా గుర్తించిన లోకో పైలట్‌లు రైలు ఆపేశారు.
News July 6, 2025
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.