News July 6, 2025
NLG: విద్యాశాఖ సతమతం.. రెగ్యులర్ ఎంఈఓలు ఎక్కడ!?

జిల్లా విద్యాశాఖలో సిబ్బంది కొరత వేధిస్తుంది. జిల్లాలోని అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలనే ఇన్చార్జ్ ఎంఈవోలుగా నియమించారు. దీంతో ప్రభుత్వ విద్య కుంటుపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పని ఒత్తిడితో ఇంచార్జ్ ఎంఈఓలు సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
Similar News
News November 6, 2025
NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News November 6, 2025
NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
News November 6, 2025
సాగర్‌లో నేటి నుంచి బీసీ గురుకులాల క్రీడలు

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల మహాత్మాజ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం నుంచి బీసీ గురుకుల పాఠశాలల, కళాశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే పోటీల్లో అండర్-14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అండర్ -14 విభాగాలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు.


