News July 6, 2025

HYDలో 1992 నాటి కూరగాయల మార్కెట్

image

HYD గుడిమల్కాపూర్ మార్కెట్ పక్కనే కూరగాయలు మార్కెట్ ఉంది. మెహదీపట్నం బస్టాండ్ కోసం గుడిమల్కాపూర్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 1992లో నిర్మాణాలు చేపట్టారు. కానీ మద్యలో వ్యవసాయ మార్కెట్ కోసం దానిని అప్పగించారు. అప్పటి నుంచి 3 దశాబ్దాలుగా సాగుతుంది. ఇక్కడికి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి సైతం కూరగాయలు వస్తుంటాయి.

Similar News

News July 6, 2025

మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

image

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.

News July 6, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> గానుగుపహాడ్ బ్రిడ్జి వద్ద బీజేపీ, బీఆర్ఎస్ నిరసన
> స్టేషన్ ఘనపూర్: ప్రమాదం అంచున విద్యార్థుల ప్రయాణం!
> జనగామలో కొనసాగుతున్న “మన జిల్లా మన నీరు” కార్యక్రమం
> జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
> జనగామ: అండర్ గ్రౌండ్ మోరీ పనులు పూర్తి చేయాలని డిమాండ్
> జనగామలో కరెంటోళ్ల నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
> స్థానిక ఎన్నికల్లో గెలుపుకు కృషి చేద్దాం: రాజయ్య
> దేవరుప్పులలో వర్షం

News July 6, 2025

ప‌ర్యాట‌కులకు స్వ‌ర్గ‌ధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం: లక్ష్మీశా

image

ఎన్టీఆర్ జిల్లాను ప‌ర్యాట‌కులకు స్వ‌ర్గ‌ధామంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం ఆయన విజయవాడ భవానీ ఐలాండ్‌ను పరిశీలించారు. సెల్ఫీ పాయింట్లు, మేజ్ గార్డెన్‌, బోటింగ్ పాయింట్‌లను ఆయన పరిశీలించారు. ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఈ రంగంలో స్థూల విలువ (జీవీఏ) పెంచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.