News July 6, 2025
సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్ పదవికి నామినేషన్

ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్ చేసింది. ఇస్రో, బార్క్ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.
Similar News
News July 6, 2025
రెవెన్యూ సమస్యలకు త్వరలోనే చెక్: మండపల్లి

రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 22 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News July 6, 2025
మోదీజీ.. హిమాచల్ వరదలపై ట్వీట్ చేయరా?: నెటిజన్లు

ప్రధాని మోదీ అమెరికాలో వచ్చిన వరదలపై స్పందించారు కానీ హిమాచల్ ప్రదేశ్ (HP)విలయంపై మాట్లాడకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మోదీ 22 గంటల క్రితం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కానీ 5 రోజుల క్రితమే HPలో వరదలు వచ్చి 74 మంది చనిపోయినా, ఎంతో మంది నిరాశ్రయులైనా ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
News July 6, 2025
ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి: అమర్నాధ్

వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్ అన్నారు. రోలుగుంటలో ఆదివారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతీ కార్యకర్త ప్రజలకు వివరించాలని అమర్నాధ్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికునిలా ఇప్పటి నుంచే పని చేయాలని పిలుపునిచ్చారు.