News July 6, 2025

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

image

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Similar News

News July 7, 2025

సత్తెనపల్లి: ట్రైన్ కిందపడి యువకుడి ఆత్మహత్య

image

సత్తెనపల్లి (M) గుడిపూడి రైల్వే ట్రాక్‌పై యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. సోమవారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతుడు గుడిపూడికి చెందిన సన్నీ (22)గా గుర్తించారు. మృతుడి తల్లి అనారోగ్యానికి గురవ్వగా పరామర్శించడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News July 7, 2025

ICC CEOగా సంజోగ్ గుప్తా

image

ICC CEOగా భారత్‌కు చెందిన సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ICC ప్రకటించింది. సంజోగ్ ప్రస్తుతం జియోస్టార్‌లో స్పోర్ట్స్, లైవ్ ఎక్స్‌పీరియన్స్ CEOగా ఉన్నారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో B.A పట్టా పొందిన ఆయన జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. టీవీ నెట్‌వర్క్‌లో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు ICC CEO పదవి చేపట్టిన ఏడో వ్యక్తిగా నిలిచారు.

News July 7, 2025

జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

image

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.