News July 6, 2025
NTR: కృష్ణా నదిలో భవిష్య స్కూల్ అధినేత డెడ్ బాడీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని భవిష్య స్కూల్ అధినేత శ్రీధర్ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని కృష్ణా నది నుంచి వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 7, 2025
జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
News July 7, 2025
మహబూబ్ నగర్ IIIT.. నేడు కౌన్సెలింగ్

మహబూబ్ నగర్‌లోని నూతనంగా ఏర్పాటు చేసిన IIITలో 181 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. నేడు S.NO:1 నుంచి 564 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే E-Mail admissions@rgukt. ac.in, 90525 95661,73825 95661 సంప్రదించాలన్నారు. SHARE IT
News July 7, 2025
ఉమ్మడి పాలమూరు “CRICKET” జట్టు ఇదే!

శ్రీకాంత్( కెప్టెన్)-SDNR, MOHD షాబాద్( వైస్ కెప్టెన్)-MBNR, అబ్దుల్ రాపే(MBNR), MD ముఖిత్(MBNR), జయసింహ(పెబ్బేర్), శ్రీకాంత్(MBNR), అక్షయ్(NRPT), సంజయ్(MBNR), ఛత్రపతి(GDWL), రామ్ చరణ్(NGKL), గగన్(NGKL), శశాంక్(MBNR), హర్షిత్(JDCL), కేతన్ కుమార్(JDCL), అక్షయ్ సాయి(JDCL), జస్వంత్(NGKL). నేటి నుంచి ప్రారంభమయ్యే B-డివిజన్ టుడే లీగ్ ఛాంపియన్షిప్‌లో 16 మందితో కూడిన ఈ జట్టు పాల్గొననుంది.