News July 6, 2025

HYD: జవాన్ల కోసం 3D ప్రింటింగ్ భవనం

image

సివిల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ రోజు రోజుకు నూతన పుంతలు తొక్కుతోంది. దేశంలోని తొలిసారి జవాన్ల కోసం మధ్యప్రదేశ్ గాల్వియర్‌లో 3D ప్రింటింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో మన IIT హైదరాబాద్ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఏకంగా సుమారు 14 మంది జవాన్లు నివసించే అవకాశం ఉంటుంది. సాధారణ నిర్మాణాలు సాధ్యం కాని ప్రాంతాలలో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.

Similar News

News July 7, 2025

విశాఖ: ‘రాందేవ్ బాబాకు భూ కేటాయింపులు ఆపండి’

image

జీఓ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6లక్షల ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి ఎస్సీలకే కేటాయించాలని విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. శారదా పీఠం నుండి తీసుకున్న భూములు రామ్ దేవ్ బాబాకు ఇవ్వొద్దని, ఉమ్మడి విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలపై వేసిన రెండు సిట్‌ల నివేదికలూ బయట పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 7, 2025

సిద్దిపేట: ‘బకాయిలను వెంటనే విడుదల చేయాలి’

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అభిషేక్, భాను, రంజిత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రూ.8,000 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజ్ రియంబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

News July 7, 2025

అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.