News July 6, 2025

భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

image

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News July 7, 2025

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఉచిత ఇసుక రవాణాలో అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 7, 2025

మహిళలు శక్తిమంతులు: సిద్దిపేట కలెక్టర్

image

మహిళలు శక్తిమంతులని, వారి పనికి వెలకట్టలేమని, వర్తక, వ్యాపార రంగంలోనూ ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సమాఖ్య భవనం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు.

News July 7, 2025

ఖాజాగూడ భూకబ్జా కేసులో హైకోర్టు నోటీసులు

image

ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీనాయక్, కూచుకుల్ల రాజేశ్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. షోహిని బిల్డర్స్, బెవర్లీ హిల్స్‌తో సహా ఐదుగురు ప్రైవేట్ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండువారాల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది.