News July 6, 2025
తాండూర్: లారీ ఢీకొని ఒకరి మృతి

తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక డాబా నుంచి బిర్యానీ తీసుకుని తాండూర్ బోర్డు వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాసిపేటకు చెందిన మల్లేశ్ గౌడ్(36)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News July 7, 2025
GILL: ప్రపంచంలో ఒకే ఒక్కడు

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచులో 400+, లిస్ట్ ఏ మ్యాచులో 200+, టీ20 మ్యాచులో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచంలో మరే ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా రెండో టెస్టు మ్యాచులో గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
News July 7, 2025
పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది: మోదీ

17వ BRICS సదస్సులో ‘శాంతి-భద్రత, రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్’ అనే అంశంపై జరిగిన చర్చలో.. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఒక్కటిగా పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘పహల్గామ్‌లో మానవత్వంపై దాడి జరిగింది. ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటి. ఉగ్రవాదుల్ని ఏ దేశం ప్రోత్సహించినా మూల్యం చెల్లించేలా చేయాలి. బాధితుల్ని, ఉగ్రవాదుల్ని ఒకే త్రాసులో ఉంచలేం’ అని మోదీ పేర్కొన్నారు.
News July 7, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 7, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.