News March 30, 2024
CMAT దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(CMAT)కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏదైనా డిగ్రీ పాసైన వారు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఏప్రిల్ 18లోపు అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ విద్యార్థులు రూ.2,000, మిగతా అందరూ రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. మేలో పరీక్ష జరిగే అవకాశం ఉంది.
వెబ్సైట్: <
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన మస్క్.. $1 ట్రిలియన్ ప్యాకేజ్

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రికార్డు సృష్టించారు. ఆయనకు $1 ట్రిలియన్ (₹88 లక్షల కోట్లు) ప్యాకేజ్ ఇచ్చేందుకు 75% టెస్లా షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కార్పొరేట్ రంగంలో అత్యంత ఎక్కువ ప్యాకేజ్ గల CEOగా చరిత్ర సృష్టించారు. అయితే మస్క్ నెల జీతంగా కాకుండా ఆ మొత్తాన్ని వచ్చే పదేళ్లలో స్టాక్స్ రూపంలో పొందుతారు. ప్రస్తుతం 476 బి.డాలర్లతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.


