News July 6, 2025
NGKL: జిల్లా విద్యుత్ ఎస్ఈ సీహెచ్ పౌల్ రాజ్ బదిలీ

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సీహెచ్ పౌల్ రాజ్‌ను బదిలీ చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన ఇక్కడ దాదాపు ఏడాది పాటు ఎస్ఈగా విధులు నిర్వహించారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాల్సి ఉంది.
Similar News
News July 7, 2025
గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.
News July 7, 2025
NZB: రైలు ఢీకొని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
News July 7, 2025
రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.