News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR నుంచి సూపర్ లగ్జరీబస్సును ఏర్పాటుచేసినట్లు DM తెలిపారు. ఈనెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనమనంతరం 10న అరుణాచలం నుంచి బయలుదేరి మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11న సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.4700, పిల్లలకు రూ.3540 చార్జీగా నిర్ణయించారు.
Similar News
News July 7, 2025
కానిస్టేబుల్‌పై దాడి.. యోగి మార్క్ ట్రీట్మెంట్

UP: ఫిలిభిట్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో తండ్రి, ముగ్గురు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహావీర్ ఫిర్యాదు ప్రకారం.. ఢాకా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి మహావీర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఓ గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు దాడి చేసి, యూనిఫామ్ చింపేశారు. వారికి పోలీసులు వారి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులే దౌర్జన్యం చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.
News July 7, 2025
గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.
News July 7, 2025
NZB: రైలు ఢీకొని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.