News July 6, 2025

జగిత్యాల: పలువురు ఎస్ఐలకు స్థాన చలనం

image

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు బాసర మల్టీజోన్ ఐజీ 2 ఉత్తర్వులు జారీ చేశారు. కే. కుమారస్వామి బీర్పూర్ నుంచి డీఎస్‌బీ జగిత్యాల, మిర్యాల రవీందర్ వీ.ఆర్ జగిత్యాల నుంచి ధర్మపురి ఎస్సై 2, ఎస్.రాజు వీ.ఆర్ జగిత్యాల నుంచి బీర్పూర్, ఎం.సుప్రియ వీ.ఆర్ జగిత్యాల నుంచి సీసీఎస్ జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.

Similar News

News July 7, 2025

సిరిసిల్ల: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

image

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712656425కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News July 7, 2025

కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

image

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా కడుపులో పెన్నులు ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు. భర్త మీద కోపంతో పెన్నులు మింగినట్లు వైద్యులు తెలిపారు.

News July 7, 2025

బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద భక్తులపై హిజ్రాల దాడి

image

బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వస్తున్న భక్తులపై హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారి దర్శనం కోసం ఆటోలో వచ్చారు. బోయకొండ వద్ద ఆటోలు ఆపిన హిజ్రాలు.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినంత ఇవ్వకపోవడంతో గొడవకు దిగారు. ఈ దాడిలో ఐదుగరు గాయపడగా.. వారు చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.