News July 6, 2025
చీరాల: కుక్కను ఢీకొని ఆగిన వందే భారత్

విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ ఆదివారం సాయంత్రం కుక్కను ఢీకొనడంతో 20 నిమిషాలు ఆగిపోయింది. ఈ ఘటన కారంచేడు రైల్వే గేట్ సమీపంలో జరిగింది. రైల్వే అధికారులు సమాచారం ప్రకారం.. కుక్క కళేబరం బ్రేక్ సిస్టంకి అడ్డుపడింది. ఈ కారణంగా సాంకేతిక లోపం ఏర్పడగా గుర్తించిన లోకో పైలట్‌లు రైలు ఆపేశారు.
Similar News
News July 7, 2025
విజయవాడలో ఇంటర్ చదువులపై వెబ్ సిరీస్

విజయవాడలో ఇంటర్ చదువులపై OTT ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన AIR వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. విజయవాడ శివార్లలోని ఓ కళాశాలలో ఇంటర్ చదివే ముగ్గురు విద్యార్థుల గురించి తీసిన ఈ సిరీస్ గురించి సామాజిక మాధ్యమాలలో సైతం విస్తృత చర్చ నడుస్తోంది. ఇందులోని ప్రధాన పాత్రధారులంతా విజయవాడలో నివసించే కుటుంబాలుగా చూపించారు.
News July 7, 2025
విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.
News July 7, 2025
సిరిసిల్ల: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712656425కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.