News March 30, 2024

తూ.గో: వేసవి ప్రారంభంలోనే భానుడి భగభగలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో వేసవికాలం ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ఆఖరు నాటికే సుమారు 35-38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రమై ప్రయాణికులు, పనులకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ముగిసే నాటికి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల వరకూ అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Similar News

News April 19, 2026

తూ.గో: రేపు యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్‌

image

తూ.గో జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌‌లు యథావిధిగా జరుగుతాయని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమంలో RDOలు, MROలు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News April 18, 2026

ఎకానమీ దిశగా కీలక అడుగులు: సీఎం చంద్రబాబు

image

ఇంటింటి నుంచి చెత్త సేకరణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథాలను’ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. నిడదవోలులో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్లు, మ్యాజిక్ డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు అదనంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.