News July 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News July 7, 2025
జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి

AP: వైసీపీ అధినేత జగన్ ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. మామిడి రైతులను పరామర్శించే మార్కెట్ యార్డు చిన్నది కావడంతో జగన్‌తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించారు. పర్యటనలో ఎలాంటి ర్యాలీలు, రోడ్‌షోలు చేయకూడదని నిబంధన పెట్టారు. గత పర్యటనల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
News July 7, 2025
కొత్త దందా.. విచ్చలవిడిగా వయాగ్రా, అబార్షన్ ట్యాబ్లెట్ల అమ్మకాలు!

AP: ఉభయ గోదావరి జిల్లాల్లోని మెడికల్ షాపుల్లో కొత్త దందా తెరపైకి వచ్చింది. అనుమతి లేకుండా అబార్షన్లు, అడ్డగోలుగా వయాగ్రా ట్యాబ్లెట్లు అమ్ముతున్నారని తెలుస్తోంది. టార్గెట్ల పేర్లతో ఇష్టారీతిన అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ట్యాబ్లెట్లు వాడేందుకు అనుమతి ఉండాలని, ఎక్కువగా వాడితే అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
News July 7, 2025
VIRAL అవ్వాలనే కోరికతో పిచ్చి పీక్స్‌లోకి..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు యువత వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్లు చేయడం మానసిక సమస్యేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒడిశాలో పట్టాలపై యువకుడి <<16967141>>వీడియో<<>>, వరంగల్‌లో మైనర్ల <<16950091>>రీల్స్<<>> ఇందుకు ఉదాహరణలు. సోషల్ మీడియాకు బానిసలవుతున్న పిల్లలకు కౌన్సెలింగ్ అవసరమని, తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.