News March 30, 2024

పత్తికొండ: అత్యధిక మెజార్టీ ఆ మహిళకే…!

image

పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరగిన అసెంబ్లీ ఎన్నికలలో కంటే 2019 ఎన్నికలలో కే. శ్రీదేవీ YCP నుంచి పోటీచేసి TDP అభ్యర్థి కే.ఈ శ్యాంబాబుపై 42.065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలకు కూడా YCP అధిష్ఠానం ఈమెకే మళ్లీ అవకాశమిచ్చింది. ఈమెకు ప్రత్యర్థిగా TDP అధిష్ఠానం కూడా కే. ఈ శ్యాంబాబును బరిలో దింపింది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరి సొంతమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News May 7, 2025

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కర్నూలు కలెక్టర్

image

విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించినప్పుడే మంచి స్థాయిలో నిలుస్తారని అన్నారు.

News May 7, 2025

అవయవ దానంతో పునర్జన్మను ఇవ్వొచ్చు: కలెక్టర్

image

అవయవదానం మానవతా కోణంతో చేసే ఒక గొప్ప పనని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఓ హాస్పిటల్‌లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవదానం కేవలం దానం కాదు, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపే ఆచరణని తెలిపారు. అనంతరం వైద్యులను కలెక్టర్ సన్మానించారు.

News May 7, 2025

హాలహర్విలో వైసీపీ నాయకుడి హత్య

image

హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ఆయన సాయంత్రం మృతదేహమై కనిపించాడు. కుటుంబీకుల సమాచారంతో సీఐ రవిశంకర్ రెడ్డి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.